గుండెల్లో గోదారి మూవీ రివ్యూ



గుండెల్లో గోదారి మూవీ కి ఓపెనింగ్స్ రావటానికి కారణం  ట్రైలర్ లో చూపించిన 1986 లో  వచ్చిన వరదలు, ఆ వరదలని చూపించిన విసువల్ ఎఫెక్ట్స్ . మూవీ లో మొదటి 15 నిముషాలు గ్రాఫిక్స్ పరంగా , స్టొరీ ప్రకారం గా బాగుంటుంది. స్టార్టింగ్ మిస్ అవ్వద్దు. మూవీ లో సెంటిమెంట్,లవ్,టీనేజ్ లవ్,ఎమోషన్స్ అన్ని వుంటాయి. ఇలాంటి స్టొరీ ఓరియెంటెడ్  మూవీ ని తీసిన డైరెక్టర్ కుమార్ నాగేందర్,నిర్మాత మంచు లక్ష్మి ని మెచ్చుకోవాలి . స్టొరీ లో బాగా ఇన్వొల్వె చేసాడు డైరెక్టర్. డైరెక్టర్ కి మంచి టాలెంట్ వుంది. మ్యూజిక్ ఇళయరాజా. ఫస్ట్ హాఫ్ లో 3 సాంగ్స్ బాలేదనేచెప్పాలి.సెకండ్ హాఫ్ లో సాంగ్స్ బాగున్నాయి. మూవీ లో హీరోస్ ఆది,సందీప్.హీరోయిన్స్   మంచు లక్ష్మి,తాపసి. మూవీ లో పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే మంచు లక్ష్మి చాల బాగా చేసింది,అలాగే హీరోస్ ఆది,సందీప్,తాపసి కూడా బాగా  చేసారు. స్టొరీ అంత వీళ్ళ నలుగురు గురించే.మూవీ లో చెప్పుకునే వాటిలో గ్రాఫిక్స్. మూవీ చుస్తే తెలుసుతుంది ఆ వరదలని చూపించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్దరో అని.  ఏదయినా సరదాగా వుండే మూవీ కి వెల్దమనుకునె వాళ్ళకి నచ్చదు. కాని ఒక మంచి స్టొరీ వున్నా మూవీ చూద్దామనుకుంటే తప్పకుండ వెళ్ళండి.
నాగ

మిస్టర్ పెళ్ళికొడుకు మూవీ రివ్యూ

హాయ్... ఈ మిస్టర్ పెళ్ళికొడుకు మూవీ హిందీ లో హిట్ అయిన తను వెడ్స్ మను మూవీ రీమేక్. మూవీ లో  
సునీల్ చాల స్టైలిష్ గా కనిపిస్తాడు. హీరోయిన్ ఇషా చావ్లా యాక్టింగ్ బాగుంది. సునీల్ ఇషా చావ్లా కాంబినేషన్ 2వ సారి,పూలరంగడు లో ఒకసారి చేసారు.సునీల్ డాన్సు సూపర్ గా చేసాడు, ఇక నుండి యంగ్ హీరోస్ కి సునీల్ డాన్సు లో మంచి కాంపిటీషన్.ఆలి రోల్ బాగుంది. స్టొరీ లో అంత కొత్తదనము  ఏమి లేదు,మూవీ స్లో గా వెళ్తుంది.టోటల్ మూవీ 1 గంట 20 నిముషాలు. సాంగ్స్ ఇంకా బాగుంటే బాగుండేది. క్లైమాక్స్ లో పూలరంగడు మూవీ లో లాగ సునీల్ సిక్స్ ప్యాక్ చూపిస్తాడు. టోటల్ గా ఇది వన్ టైం వాచ్ మూవీ.

నాగ 

జబర్దస్త్ మూవీ రివ్యూ



హాయ్... జబర్దస్త్ మూవీ కి ఓపెనింగ్స్ బాగుండటానికి ఒకే ఒక్క కారణం డైరెక్టర్ నందిని రెడ్డి.  నేను తప్పకుండ ఒకటి చెప్పాలి.ఈ  జబర్దస్త్ మూవీ హింది లో హిట్ అయిన బ్యాండ్ భారత్ భాజా మూవీ కి రీమేక్. కాకపోతే ఇప్పటి వరకు ఈ వార్త మూవీ వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు. ఆ హిందీ మూవీ ని మన వాళ్ళకి దగ్గరగా కొంత స్టొరీ లో మార్పులు బాగా చేసింది డైరెక్టర్. హీరో సిద్ధార్థ మాస్ రోల్ లో కనిపిస్తాడు. ఆ హిందీ మూవీ లో కామెడీ తక్కువే అని చెప్పాలి. కాని జబర్దస్త్ లో కామెడీ మూవీ తో పాటు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వుంటుంది. ఈ కామెడీ కూడా సిద్ధార్థ  చుట్టే  వుంటుంది. వరుస ఫ్లాప్స్ తో వున్నా సిద్ధార్థ కి ఇది ఒక మంచి సినిమా అనే చెప్పాలి. సమంతా అదృష్టం కలిసి వచిందేమో .ఇక సమంతా ఎప్పటి లాగానే అందంగ వుంది. ఈ మూవీ అంత సిద్దార్థ సమంతా ల గురించే. నిత్య మీనన్ ఒక కొత్త రోల్ లో కనిపిస్తుంది.  నందిని రెడ్డి కి స్టొరీ సెలక్షన్ బాగా తెలుసు. సాంగ్స్ బాగున్నాయి,తమన్ మంచి మ్యూజిక్ ఇచాడు. మూవీ 2 గంటల 33 నిముషాలు .కాని ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేసి మూవీ ని 2 గంటల 10 నిమిషాల కి తగ్గిస్తే బాగుండేది. క్లైమాక్స్ లో వచ్చే కామెడీ అండ్ సిద్హత చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇది ఒక యబౌ యావరేజ్ మూవీ.
నాగ

పిజ్జా మూవీ రివ్యూ

హాయ్... పిజ్జా మూవీ రిలీజ్ కాకా ముందు సమంతా ఈ మూవీ గురించి ప్రొమొతిఒన్స్ చేసింది. అది చూస్తే ఇది ఒక మంచి లవ్ స్టొరీ అని తెలుస్తుంది. కాని ఇది లవ్ స్టొరీ మాత్రమే కాదు, మంచి హర్రర్ మూవీ కుడా. హీరో యాక్షన్ బాగుంది. మూవీ మంచి లవ్ స్టొరీ గ స్టార్ట్ అయ్యి ఎలాగా హర్రర్ మూవీ గా మారుతుంది అనేదే ఈ మూవీ స్టొరీ. ఈ మూవీ లో హర్రర్ సీన్స్ చాల వరకు హాలీవుడ్ మూవీ 1408 నుండి ఇన్ స్పైర్ అయ్యాడు డైరెక్టర్. హర్రర్ సీన్స్ బాగుంటాయి. హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంటుంది. మొతానికి ఇది ఒక యబోవ్ యవేరేజ్ మూవీ.
                                                                                                                                                         నాగ

మిర్చి మూవీ రివ్యూ

హాయ్... మిర్చి మూవీ మీద అందరికి చాల అంచనాలున్నాయి,దానికి 2 కారణాలు . 1.ప్రభాస్ న్యూలుక్ 2.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ముఖ్యం గా మిర్చి టైటిల్ సాంగ్.  చాల మూవీస్ కి మాటలు రాసిన కొరటాల శివ ఈ మూవీ కి డైరెక్టర్. కొత్త డైరెక్టర్ మూవీ ని ఎలా తీస్తాడో అని అనుకున్న వాళ్ళందరూ ఈ మూవీ చూస్తే బాగా తీసాడు అనటమే కాదు వావ్ అని కూడా అంటారు. కథ సింపుల్ గా వున్నా దానిని మనకి చూపించిన పద్ధతి బాగుంది. మూవీ లో సెంటిమెంట్ ఎంత వరకు వుంటే బాగుంటుందో అంత వరకు మాత్రమే వుంది. ప్రభాస్ చెప్పే ప్రతి డైలాగ్ సూపర్బ్ గా వుంది, ఒక డైలాగ్ రైటర్  డైరెక్టర్ అయితే ఆ మాత్రం వుంటుంది మరి. ప్రభాస్ ని క్లాసు గా చూపిస్తూ మాస్ కి నచ్చే ప్రతి అంశం ఉండేలా చూసాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇక సాంగ్స్ కి వస్తే ఏ సాంగ్ కూడా అనవసరం గా మూవీ లో రాదగు. ప్రతి సాంగ్ బాగుంది. సాంగ్స్ వన్ అఫ్ ది హైలైట్స్ గా చెప్పచు. బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో అందగాడు అంటే ఫస్ట్ మహేష్ బాబు   పేరే చెప్పుకుంటారు ,కాని ఇప్పటి నుండి మహేష్ తో పాటు  ప్రభాస్ పేరు కూడా చెప్పుకుంటారు,ఈ క్రెడిట్ కొరటాల శివ కి ఇవ్వాల్సిందే. ఇక హీరోఇన్స్ దగ్గరకు  వస్తే అనుష్క చాల అందం గా ప్రభాస్ పక్కన సూపర్ గా సెట్ అయింది. రీచా గంగోపాధ్యాయ తన రోల్ వరకు బాగా చేసింది.  టోటల్  గా  ఇది యబౌ యావరేజ్  మూవీ
నాగ 

ఒంగోలుగిత్త మూవీ రివ్యూ


హాయ్... ఒంగోలుగిత్త మూవీ హీరో రామ్ కి,హీరోయిన్ కృతి కర్బంధ కి,డైరెక్టర్ భాస్కర్ కి హిట్ అవటం చాల అవసరం, ఎందుకంటే ఈ ముగ్గురు ఫ్లాప్ లో వున్నారు ఇప్పటివరకు. మూవీ అంత  మిర్చి యార్డ్  చుట్టూ తిరుగుతుంది. రామ్ ఎప్పటిలాగే యనర్జతిక్ గ యాక్ట్ చేసాడు. కృతి కర్బంధ ,ప్రకాష్ రాజ్ యాక్షన్ కొత్తగా & బాగుంటుంది. రామ్ & కృతి కర్బంధ సీన్స్ చాల బాగుంటాయి. 3 సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, స్టొరీ కొత్తగా అనిపించకపోవటం,స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేకపోవటం మూవీ కి చాల పెద్ద మైనస్ . సెకండ్ హాఫ్ బాగా స్లో గా వుంటుంది. కొన్ని సీన్స్ బోర్ గా అనిపించాయి. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. మొత్తం మీద ఇది వన్ టైం వాచ్ మూవీ.
నాగ 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రివ్యూ

హాయ్... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లో పెద్దోడు అంటే వెంకటేష్,చిన్నోడు అంటే మహేష్. ఒక ఇంట్లో అన్నయ్య ఎలా ఉండాలో తమ్ముడు ఎలా ఉండాలో వెంకటేష్ మహేష్ లు అలాగే వున్నారు. మహేష్ డైలాగు డెలివరీ కొత్తగా వుంది,డ్రెస్సింగ్ సూపర్ గా వుంది. వెంకటేష్ మహేష్ ల నటన సూపర్ గా వుంటుంది.అన్నదమ్ములు అంటే ఇలాగె వునాలి అన్నటు గా వుంటారు.నటన గురించి అయితే అంజలి గురించి తప్పకుండ చెప్పుకోవాలి.చాల బాగా చేసింది. మూవీ లో కామెడి అంత మహేష్ డైలాగు లోనే వుంటుంది. ప్రతి సీన్ మనకి టచ్ అవుతుంది. మిక్కి మంచి సాంగ్స్ ఇచాడు. ఫ్యామిలీ లో మన రిలేషన్స్ ఎలా ఉండాలో,మనుషులు గా మనం ఎలా ఉండాలో చాల చక్కగా చూపించారు. ఈ మూవీ లో ఒక పెళ్లి వుంటుంది,చాలా బాగా చూపించారు.డైరెక్టర్ శ్రీకాంత్ అద్దాల కి మంచి భవిష్యత్ వుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. చూసాక ఒక మంచి ఫ్యామిలీ ని చూసాం అని అనిపిస్తుంది. 
నాగ 

Powered by Blogger.