హాయ్... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లో పెద్దోడు అంటే వెంకటేష్,చిన్నోడు అంటే మహేష్. ఒక ఇంట్లో అన్నయ్య ఎలా ఉండాలో తమ్ముడు ఎలా ఉండాలో వెంకటేష్ మహేష్ లు అలాగే వున్నారు. మహేష్ డైలాగు డెలివరీ కొత్తగా వుంది,డ్రెస్సింగ్ సూపర్ గా వుంది. వెంకటేష్ మహేష్ ల నటన సూపర్ గా వుంటుంది.అన్నదమ్ములు అంటే ఇలాగె వునాలి అన్నటు గా వుంటారు.నటన గురించి అయితే అంజలి గురించి తప్పకుండ చెప్పుకోవాలి.చాల బాగా చేసింది. మూవీ లో కామెడి అంత మహేష్ డైలాగు లోనే వుంటుంది. ప్రతి సీన్ మనకి టచ్ అవుతుంది. మిక్కి మంచి సాంగ్స్ ఇచాడు. ఫ్యామిలీ లో మన రిలేషన్స్ ఎలా ఉండాలో,మనుషులు గా మనం ఎలా ఉండాలో చాల చక్కగా చూపించారు. ఈ మూవీ లో ఒక పెళ్లి వుంటుంది,చాలా బాగా చూపించారు.డైరెక్టర్ శ్రీకాంత్ అద్దాల కి మంచి భవిష్యత్ వుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. చూసాక ఒక మంచి ఫ్యామిలీ ని చూసాం అని అనిపిస్తుంది.
నాగ