హాయ్... జబర్దస్త్ మూవీ కి ఓపెనింగ్స్ బాగుండటానికి ఒకే ఒక్క కారణం డైరెక్టర్ నందిని రెడ్డి. నేను తప్పకుండ ఒకటి చెప్పాలి.ఈ జబర్దస్త్ మూవీ హింది లో హిట్ అయిన బ్యాండ్ భారత్ భాజా మూవీ కి రీమేక్. కాకపోతే ఇప్పటి వరకు ఈ వార్త మూవీ వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు. ఆ హిందీ మూవీ ని మన వాళ్ళకి దగ్గరగా కొంత స్టొరీ లో మార్పులు బాగా చేసింది డైరెక్టర్. హీరో సిద్ధార్థ మాస్ రోల్ లో కనిపిస్తాడు. ఆ హిందీ మూవీ లో కామెడీ తక్కువే అని చెప్పాలి. కాని జబర్దస్త్ లో కామెడీ మూవీ తో పాటు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వుంటుంది. ఈ కామెడీ కూడా సిద్ధార్థ చుట్టే వుంటుంది. వరుస ఫ్లాప్స్ తో వున్నా సిద్ధార్థ కి ఇది ఒక మంచి సినిమా అనే చెప్పాలి. సమంతా అదృష్టం కలిసి వచిందేమో .ఇక సమంతా ఎప్పటి లాగానే అందంగ వుంది. ఈ మూవీ అంత సిద్దార్థ సమంతా ల గురించే. నిత్య మీనన్ ఒక కొత్త రోల్ లో కనిపిస్తుంది. నందిని రెడ్డి కి స్టొరీ సెలక్షన్ బాగా తెలుసు. సాంగ్స్ బాగున్నాయి,తమన్ మంచి మ్యూజిక్ ఇచాడు. మూవీ 2 గంటల 33 నిముషాలు .కాని ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేసి మూవీ ని 2 గంటల 10 నిమిషాల కి తగ్గిస్తే బాగుండేది. క్లైమాక్స్ లో వచ్చే కామెడీ అండ్ సిద్హత చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇది ఒక యబౌ యావరేజ్ మూవీ.
నాగ